రాయపోల్ : గ్రామాల సమగ్ర అభివృద్ధి ( Village Development ) కి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోందని సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం వీరారెడ్డిపల్లి సర్పంచ్ రొయ్యల సుగుణ శ్రీనివాస్ ( Suguna Srinivas ) అన్నారు. గురువారం గ్రామంలో రూ.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల ( CC Roads ) నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
ఆమె మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనులు చేపట్టినట్లు వెల్లడించారు. వర్షాకాలంలో బురద, నీటి నిల్వలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. అభివృద్ధి పనుల అమలులో ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు.
నిర్మాణ పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మంకిడి స్వామి, వార్డు సభ్యులు, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.