(Jagan Help) అమరావతి: ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన దయాగుణాన్ని చాటుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో మృతి చెందిన ఓ అభిమాని కుటుంబాన్ని ఆదుకుంటానని గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. తమ కుటుంబాన్ని ఆదుకునేందుకు సీఎం జగన్ ముందుకురావడం పట్ల అభిమాని కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.
వివరాల్లోకెళ్తే.. అనంతపురం జిల్లా గుత్తి మండలం పెద్దదొడ్డి గ్రామానికి చెందిన రంగారెడ్డి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. ఆయనకు భార్య రమణమ్మ, కుమార్తెలు భారతి, భాగ్యలక్ష్మి ఉన్నారు. జగన్ చేపట్టిన పాదయాత్రలో రంగారెడ్డి ఇడుపులపాయ నుంచి వైఎస్ జగన్ వెంట వెళ్లారు. నెల్లూరు జిల్లా కాండ్ర గ్రామంలో తన అభిమాన నేతతో కరచాలనం చేసి ఫొటో కూడా దిగారు. అదే రోజు మధ్యాహ్నం గుండెపోటు రావడంతో రంగారెడ్డి గూడూరు దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. రంగారెడ్డి మరణవార్త తెలుసుకున్న జగన్.. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. కాగా, కొద్దిరోజుల క్రితం జగన్కు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి రంగారెడ్డికి ఇచ్చిన హామీని గుర్తుచేయగా.. వెంటనే స్పందించిన జగన్ రూ.10 లక్షల చెక్కును పంపారు. గ్రామస్తుల సమక్షంలో రంగారెడ్డి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి చెక్కును అందజేశారు.
చర్మ క్యాన్సర్ ఎందుకు వస్తుందో కారణం తెలిసిపోయింది!
సోరియాసిస్ బాధితులకు గుడ్న్యూస్.. శాశ్వత పరిష్కారం దొరికినట్టే
నొప్పి లేని, మచ్చ రాని వీనోట్స్ సర్జరీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..