Akarshitha | కథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కోలీవుడ్ యాక్టర్ త్రిగుణ్. ఆ తర్వాత పీఎస్వీ గరుడవేగ, 24 కిస్సెస్, ప్రేమదేశంతోపాటు పలు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన త్రిగుణ్ తాజాగా కొత్త ప్రాజెక్టును లాంచ్ చేశాడు. ఈ సారి ‘ఆకర్షిత’ అనే టైటిల్‌తో రాబోతున్నాడు. ప్రొడక్షన్ నంబర్ 1గా లక్కీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది.
ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ క్లాప్ కొట్టగా.. వేణు స్వామి స్క్రిప్ట్‌ను అందజేశారు. బేబి ఆస్కా, కీర్తనలు కెమెరా స్విచాన్ చేయగా.. నటి ప్రియ ఆకర్షిత టైటిల్ లుక్‌ను లాంచ్ చేశారు. సూరిశెట్టి కిశోర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని కోరె సందీప్ యాదవ్, శ్రీకాంత్ బట్టు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. కొత్త డైరెక్టర్ కిషోర్ మంచి స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సందీప్, శ్రీకాంత్‌కు ఇది తొలి సినిమా. మేమంతా మంచి సినిమాతో రాబోతున్నామని అన్నాడు. ఆకర్షిత సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది. సీతమ్మను తీసుకురావడానికి రాముడికి వారధి అవసరమైందని.. మా చిత్రాన్ని జనాల దగ్గరకు తీసుకెళ్లడానికి మీడియా వారధిలా మాకు సపోర్ట్ చేస్తుందని డైరెక్టర్ సూరిశెట్టి కిషోర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో అదుర్స్ రఘు, కసిరెడ్డి రాజ్‌కుమార్, సత్యం రాజేశ్, బలగం జయరాం, రవి శర్మ, ప్రియ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.