హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : గోదావరిలో తెలంగాణ వాడుకొంటున్నంత మేర నీటివాటా లేనేలేదని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, చౌటుపల్లి హనుమంత్‌రెడ్డి తదితర ప్రాజెక్టులకు మంజూరుచేసిన అనుమతులన్నింటినీ పునఃసమీక్షించాలని ఏపీ సర్కార్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. గోదావరి జలాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)కు చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాసింది. బోర్డు సైతం ఏపీ వాదనలకు అనుగుణంగానే నీటిలభ్యతపై అధ్యయనం చేసేందుకు పావులు కదుపుతున్నది.
టెక్నికల్ కమిటీని ఏర్పాటుచేయాలని భావిస్తున్నది. 18వ బోర్డు సమావేశాన్ని ఆగస్టు 18న నిర్వహించాలని ఇటీవలే జీఆర్ఎంబీ నిర్ణయించింది. ఆ మేరకు ఎజెండా అంశాలను పంపాలని ఇరు రాష్ర్టాలకు ఇప్పటికే సమాచారం ఇ చ్చింది. దానికి అనుగుణంగా ఏపీ, తెలంగాణ ఇటీవలే బోర్డుకు తమ ఎజెండా అంశాలనూ పంపాయి. వాటికి అదనంగా బోర్డు సైతం పలు అంశాలను చేర్చి, ఖరారు చేసిన తుది ఎ జెండాను రాష్ర్టాలకు తాజాగా పంపింది. తె లంగాణ ప్రాజెక్టులను ఎప్పుడూ వ్యతిరేకించలేదని పదే పదే చెప్పే ఏపీ సర్కార్, యథావిధిగా మళ్లీ బోర్డు ఎదుట మాత్రం అక్కసు వెళ్లగక్కింది. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఎజెండాలో పలు అంశాలను ప్రస్తావించడంతోపాటు, చర్చకు ప్రతిపాదనలు చేసింది.
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అ నేక అభ్యంతరాలు వ్యక్తంచేసింది. విభజన త ర్వాత తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం (240 టీఎంసీలు), సీతారామ(67.05 టీఎంసీలు), చౌటుపల్లి హనుమంత్‌రెడ్డి(0.8 టీఎంసీ), ముక్తేశ్వర్ (చిన్న కాళేశ్వరం 4.5 టీఎంసీలు), రుధ-చనాక కొరాటా(1.2 టీఎంసీలు), మో దికుంట వాగు (2.047 టీఎంసీలు), కడెం-గూడెం లిఫ్ట్ (3 టీఎంసీలు) ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ-టీఏసీ ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించాలని డిమాండ్ చేసింది. సమ్మక సాగర్ అనుమతులను నిలిపివేయాలని, త మ్మిడిహట్టి నుంచి 20 టీఎంసీలకు బదులు 80 టీఎంసీలను వాడుకొనేందుకు తెలంగాణ చేపడుతున్న ప్రక్రియను సైతం అడ్డుకోవాలని ఏపీ సర్కార్ డిమాండ్ చేసింది.
ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్ ద్వారా తెలంగాణ ఇప్పటికే 273.16 టీఎంసీల నీటిని వాడుకొంటున్నద ని, అది ఉమ్మడి రాష్ట్రంలోని 265 టీఎంసీల వాటా కంటే 8.16 టీఎంసీలు ఎకువని వా దించింది. అందుకే తెలంగాణ కొత్త ప్రాజెక్టులకు గోదావరిలో నీళ్లే లేవని ఆ ఎజెండాలో పేరొన్నది. గోదావరి జలాల వినియోగంపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాం డ్ చేసింది. తెలంగాణ ప్రాజెక్టుల్లో 940.87 టీఎంసీలకు సంబంధించి టీఏసీ అనుమతుల వివరాలు సమర్పించాలని, షెడ్యూల్-2లోని మాచ్‌ఖండ్, సీలేరు పవర్ ప్రాజెక్టుల సవరణలు, పెద్దవాగు ప్రాజెక్టు ఆధునీకరణ ఖర్చు లో 18శాతం తెలంగాణ భరించాలని ఏపీ తన ఎజెండాలో ప్రతిపాదించింది. అనేక అం శాలపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తంచేసింది.

గోదావరిలో తెలంగాణకు నీళ్లు లేవంటూ ఏపీ చేస్తున్న వాదనలకు అనుగుణంగానే జీ ఆర్ఎంబీ బోర్డు సైతం పావులు కదుపుతున్న ది. గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం చే సేందుకు కొత్తగా ఒక సాంకేతిక కమిటీని ఏ ర్పాటుచేయాలని బోర్డు భావిస్తుండటం, ఆ అంశాన్ని ఎజెండాలో ప్రతిపాదించడమే దా నికి నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ కమిటీకి చైర్మన్‌గా బోర్డు చైర్మన్‌ను నియమించాలని ప్రతిపాదిస్తూ ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి శాఖకు బోర్డు లేఖ రాసింది. కమిటీకి కేంద్రం ఆమో దం తెలిపే వరకూ సంయుక్త కమిటీ ఏర్పాటుచేసి అధ్యయనం చేయించాలని బోర్డు ఉత్సాహం చూపుతుండటమే ఏపీకి ఎంతగా వత్తాసు పలుకుతున్నదో తెలిసిపోతున్నది.
బోర్డు మీటింగ్ కోసం తెలంగాణ సైతం ఎ జెండా సమర్పించింది. పోలవరం డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని తరలించేందుకు ఏపీ అక్రమం గా చేపడుతున్న పోలవరం పనులు నిలిపివేయాలని జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీ, పీపీఏలు ఇప్పటికే ఆదేశించాయని గుర్తుచేసింది. అయి నా ఏపీ ఆ ప్రాజెక్టును చేపడుతున్నదని, జీఆర్ఎంబీ తక్షణం అడ్డుకోవాలని డిమాండ్ చేసిం ది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాల సమాచారం బోర్డుకు అందలేదని, వరదనీటిపై ఆధారపడి కడుతున్న ఆ ప్రాజెక్టుల డిజైన్ సీడబ్ల్యూసీ-2025 జూలై మార్గదర్శకాలకు విరుద్ధమని, వాటికి అనుమతులివ్వకూడదని తెలంగాణ సైతం బోర్డుకు సూచిస్తూ ఎజెండాలో చేర్చింది.