“నవ్వుల రారాజు వేణుమాధవ్”
తన హావ భావాలతో, నటనతో అందరి మోములపై నవ్వులు పూయించిన వేణుమాధవ్ నవ్వులకే రారాజు అని "తెర" సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షుడు వేముల వెంకటేశ్వర్లు, గౌరవాధ్యక్షుడు పార సీతయ్య అన్నారు. సోమవారం కోదాడలో తెర సాంస్కృతిక కళామండలి ఆధ్వర్యంలో కోదాడలో...
కోదాడ, సెప్టెంబర్ 28 : తన హావ భావాలతో, నటనతో అందరి మోములపై నవ్వులు పూయించిన వేణుమాధవ్ నవ్వులకే రారాజు అని “తెర” సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షుడు వేముల వెంకటేశ్వర్లు, గౌరవాధ్యక్షుడు పార సీతయ్య అన్నారు. సోమవారం కోదాడలో తెర సాంస్కృతిక కళామండలి ఆధ్వర్యంలో కోదాడలో సినీ హాస్యనటుడు వేణుమాధవ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్ననాటి నుండే తన చేష్టలతో, హావభావాలతో, అనుకరణతో, మాట్లాడే బొమ్మతో వివిధ రకాల విన్యాసాలు చేస్తూ అందరిని నవ్వించిన వేణుమాధవ్ సినీ రంగ ప్రవేశం చేసి 400కు పైగా సినిమాలలో తనదైన శైలిలో రాణించారన్నారు. తన నవ్వుల పరిమళాన్ని తెలుగు ప్రేక్షకులకు వెదజల్లుతూ అనేక సంఘాల నుండి ప్రభుత్వం నుండి ప్రత్యేక అవార్డులను సొంతం చేసుకోవడమే తన నటనకు నిదర్శమని వారన్నారు.
నటుడిగా, మిమిక్రీ కళాకారునిగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, అన్నిట్లో తనదైన ముద్ర వేసి విజయం సాధించారని, సంగీత వాయిద్యాలను వివిధ కోణాలలో పలికించడంలో తనది అందివేసిన చేయని, కోదాడలోని కె. ఆర్. ఆర్. కళాశాలలో చదువుతున్నప్పుడు విద్యార్థి సంఘాలలో చురుకైన పాత్ర పోషించి అందరివాడు అనిపించుకున్నాడు వేణుమాధవ్. గొప్ప మానవీయకోణం ఉన్న వేణుమాధవ్ వరద బాధితుల సహాయనిధి సేకరణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో, వన మహోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టి సేవ చేశారని వారు ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలి సాంస్కృతిక కార్యదర్శి షేక్ మీరా, పోలిశెట్టి బ్రహ్మం, బూర సైదారావు, షేక్ పీర్ సాహెబ్, గుండెల సూర్యనారాయణ, చింతలపాటి శేఖర్, రామిశెట్టి హరి ప్రసాద్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

