విద్యార్థులు జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి : డాక్టర్ మువ్వా రామారావు
విద్యార్థులు జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకుడు డాక్టర్ మువ్వా రామారావు అన్నారు. సోమవారం నిడమనూరు మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ గురుకుల కళాశాలలో జీవన నైపుణ్యాలు- రాజ్యాంగం శాస్త్రీయ దృక్పథం అనే అంశంపై...
నిడమనూరు, సెప్టెంబర్ 28 : విద్యార్థులు జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకుడు డాక్టర్ మువ్వా రామారావు అన్నారు. సోమవారం నిడమనూరు మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ గురుకుల కళాశాలలో జీవన నైపుణ్యాలు- రాజ్యాంగం శాస్త్రీయ దృక్పథం అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మువ్వా రామారావు మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, ప్రశ్న ద్వారానే సమాజం మార్పు చెందుతుందన్నారు. తదనంతరం గ్రంథాలయ ఉద్యమ నాయకుడు కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా పుస్తకాలు చదవడం ద్వారా అనంతమైన విజ్ఞానాన్ని పొందవచ్చు అని తెలిపారు. ఎవరైతే ఇష్టపడి చదువుతారో జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండల్ రెడ్డి మ్యాజిక్ ప్రదర్శన ద్వారా విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాధవి లత, వైస్ ప్రిన్సిపాల్ కుమార్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి సుదర్శన్, అధ్యాపకులు, అజయ్, వంశీ, విద్యార్థులు పాల్గొన్నారు
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

