Tomato rates: టమాట ధర కిందికి.. రైతన్నల ఆందోళన
Tomato rates : గత కొన్ని రోజులుగా ఆకాశన్నంటిన టమాట ధరలు.. మెల్లమెల్లగా పడిపోతున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఒకేసారి ధరలు పడిపోవడంతో టమాట రైతులు ...

(Tomato rates) విజయవాడ: గత కొన్ని రోజులుగా ఆకాశన్నంటిన టమాట ధరలు.. మెల్లమెల్లగా పడిపోతున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఒకేసారి ధరలు పడిపోవడంతో టమాట రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కోసేందుకు చెల్లించిన కూలీ డబ్బు కూడా రాకపోవడంతో రైతన్నలు దిగాలు పడిపోయారు. అటు టమాటను తెంపి మార్కెట్‌కు పంపలేక, ఇటు తక్కువ రేటుకు పంటను అమ్ముకోలేక రైతులు అవస్థలు పడుతున్నారు. రైతుల పరిస్థితి ఇలా ఉండగా.. దిగిన ధరలు తమకు అందట్లేదని సామాన్యులు వాపోతున్నారు.
మొన్నటి వరకు కిలో టమాట రూ.70 నుంచి రూ.100 వరకు పలికింది. టమాట కొనాలంటే జనం బేజారయ్యారు. ఒకవైపు వర్షాలు కురవడం.. మరోవైపు మార్కెట్లో పంట లేకపోవడంతో ధర అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు వాతావరణం ప్రశాంతంగా మారడంతో టమాట పంట మార్కెట్‌ను ముంచెత్తుతున్నది. దాంతో ధర ఒకేసారి పడిపోయింది. ప్రస్తుతం కిలో టమాట రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతున్నది. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో టమోటా ఎక్కువగా పండుతుంది. వాతావరణం అనుకూలిస్తేనే లాభం ఉంటుంది. మూడేండ్లుగా అధిక వర్షాలు, వరదలతో ఏపీ టమాట రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నో కష్టాలకోర్చి సాగు చేస్తే.. సరైన ధర అందక రైతులు నష్టాల పాలవుతున్నారు. పెద్ద మొత్తంలో పంట వస్తున్నా.. ఇతర ఉత్పత్తుల తయారీపై దృష్టిసారించకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్లను అందుబాటులో తీసుకొస్తే కొంతమేరకైనా రైతులు లాభపడే అవకాశాలు ఉంఆయి.
ఇవి కూడా చదవండి..
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

