(Dead Dog delivery) కర్నూలు: నంద్యాల డివిజన్లోని గోస్పాడు మండలం పాసురపాడు గ్రామంలో అరుదైన, అసహజ ఘటన చోటుచేసుకున్నది. ఓ చనిపోయిన కుక్క రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పాసురపాడు గ్రామంలో ఓ ఆడ కుక్క ఐదు రోజుల క్రితం మృతి చెందింది. స్థానికులు ఆ కుక్క మృతదేహాన్ని గ్రామ శివారులో పడేశారు. అయితే, అది గర్భంతో ఉన్న విషయం అక్కడి వారికి ఎవరికీ తెలియదు. శుక్రవారం రైతు బోల శంకర్ గౌడ్ తన పొలానికి వెళ్తుండగా చనిపోయిన కుక్క పక్కనే రెండు కుక్కపిల్లలు ఉండటాన్ని గమనించాడు. ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన శంకర్ గౌడ్.. ఆ రెండు కుక్క పిల్లలను తన వెంట తీసుకెళ్లాడు. ఆడ కుక్క చనిపోయే సమయంలో అది గర్భంతో ఉన్నది గ్రామస్తులకు ఎవరికీ తెలియదని, చనిపోవడంతో గ్రామ శివారులో పడేశారని చెప్పాడు.
ఏ జీవి అయినా అది చనిపోయిన తర్వాత ప్రసవించే అవకాశం లేదని, అయితే ఇది చాలా అరుదైన ఘటన అని కర్నూలు పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ పీ రమణయ్య చెప్పారు. కుక్క చచ్చిపోయిన తర్వాత కూడా రెండు పిల్లలకు జన్మనిచ్చిన ఇలాంటి సంఘటన గురించి ఎప్పుడూ వినలేదన్నారు. ఆ కుక్క చనిపోయిన తర్వాత ఈడ్చుకెళ్తుంటే దాని కడుపులో కదలికలు వచ్చి పిల్లలు బయటకు వచ్చి ఉంటాయని డాక్టర్ రమణయ్య అభిప్రాయపడ్డారు.
చర్మ క్యాన్సర్ ఎందుకు వస్తుందో కారణం తెలిసిపోయింది!
సోరియాసిస్ బాధితులకు గుడ్న్యూస్.. శాశ్వత పరిష్కారం దొరికినట్టే
నొప్పి లేని, మచ్చ రాని వీనోట్స్ సర్జరీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..