(Car Havoc) విశాఖ: బీచ్ రోడ్డులో ఓ కారు హల్చల్ సృష్టించింది. ఉదయం వాహనాలకు ప్రవేశం లేనప్పటికీ బీచ్ రోడ్డులోకి ప్రవేశించిన ఓ తాగుబోతు.. కారును అటూఇటూ పోనిస్తూ విధ్వంసం సృష్టించాడు. బీచ్ రోడ్డులో మార్నింగ్ వాక్ చేసున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు, ప్రత్యక్ష్య సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ బీచ్ రోడ్డులో ఉదయం వేళ వాహనాలకు ప్రవేశం లేదు. అయినప్పటికీ బీచ్ రోడ్డులోకి కారు నడుపుకుంటూ వచ్చిన ఓ తాగుబోతు.. కారును కంట్రోల్ చేయలేక సతమతమయ్యాడు. ఉదయం నడకకు వచ్చిన వారిపైకి కారు దూసుకెళ్లాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను తన కారుతో ఢీకొట్టాడు. దాంతో బారికేడ్లను అడ్డం పెట్టి మద్యం మత్తులో కారు నడుపుతున్న యువకుడిని పోలీసులు, వాకర్స్ కలిసి పట్టుకున్నారు. కారులో మద్యం సీసా లభించిందని వాకర్స్ తెలిపారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మార్నింగ్ వాకర్స్ వేదనకు గురవుతున్నారు. ఉదయం వేళ కూడా పోలీసు నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
చర్మ క్యాన్సర్ ఎందుకు వస్తుందో కారణం తెలిసిపోయింది!
సోరియాసిస్ బాధితులకు గుడ్న్యూస్.. శాశ్వత పరిష్కారం దొరికినట్టే
నొప్పి లేని, మచ్చ రాని వీనోట్స్ సర్జరీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..