Union Cabinet | కేరళమ్గా మారనున్న కేరళ.. పేరు మార్పు ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
Union Cabinet | కేరళ రాష్ట్రం (Kerala state) పేరు ఇక అధికారికంగా కేరళమ్ (Keralam) గా మారనుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ పేరుమార్పు ప్రతిపాదనకు ఇవాళ కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది. పేరు మార్పుపై కేంద్రం అనుమతి కోసం కేరళ అసెంబ్లీ (Kerala Assembly) ఇప్పటికే పలుమార్లు తీర్మానాలు చేసి పంపింది.
Keralam : కేరళ రాష్ట్రం (Kerala state) పేరు ఇక అధికారికంగా కేరళమ్ (Keralam) గా మారనుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ పేరుమార్పు ప్రతిపాదనకు ఇవాళ కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది. పేరు మార్పుపై కేంద్రం అనుమతి కోసం కేరళ అసెంబ్లీ (Kerala Assembly) ఇప్పటికే పలుమార్లు తీర్మానాలు చేసి పంపింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి క్యాబినెట్ భేటీలో కేరళ పేరుమార్పు ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
తమ రాష్ట్రం పేరును పూర్వం నుంచే మలయాళంలో ‘కేరళమ్’ అని పిలిచేవారని గతంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా గుర్తుచేశారు. రాష్ట్రం పేరు మార్పు విషయంలో విజయన్ ప్రభుత్వానికి బీజేపీ కూడా మద్దతు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సీఎంకు లేఖ రాశారు. ఆ లేఖకు సీఎం బదులిస్తూ.. ‘రాష్ట్రం అసలు పేరు కేరళమ్. కానీ బ్రిటిషర్లు తమ సౌకర్యం కోసం కేరళగా మార్చారు. వారు చేసిన మార్పులను రాష్ట్ర సంస్కృతికి అనుగుణంగా సరిదిద్దుతున్నాం’ అని పేర్కొన్నారు.
ఇదిలావుంటే కేరళ పేరు మార్పు ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంతో.. ఇక రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం పేరును ‘కేరళమ్’గా సవరించాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భాషల్లో ఈ మార్పులు చేస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

