Womens T20 World Cup : పురుషుల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న అభిమానులకు మరో తీపికబురు. మహిళల పొట్టి వరల్డ్‌కప్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. మెగా టోర్నీకి మరో నాలుగు నెలలే ఉన్నందున అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉండగా.. తొలిసారి మెగా టోర్నీకి అర్హత సాధించిన నెదర్లాండ్స్ సైతం ఇదే గ్రూప్‌లో నిలిచింది. ఇంగ్లండ్ గడ్డపై జూన్ 12వ తేదన మహిళల వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది.
ఈ ఏడాది క్రికెట్ అభిమానులకు పండుగ సీజనే. మార్చి 8వ తేదీన పురుషుల టీ20 వరల్డ్‌కప్ ముగిసిన మూడు నెలలకే మహిళల పొట్టి ప్రపంచకప్ మొదలవ్వనుంది. జూన్ 12వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకూ అభిమానులను అమ్మాయిల క్రికెట్ సమరం అలరించనుంది. మెగా ఈవెంట్‌కు సమయం సమీపిస్తున్నందున.. ఐసీసీ, ఇంగ్లండ్ బోర్డు మంగళవారం గ్రూప్‌లను ఖరారు చేశాయి. మెగా టోర్నీలో పాల్గొంటున్న 12 జట్లను ఏ, బీ గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి మేటి జట్లతో పాటు బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌కు చోటు దక్కింది. గ్రూప్ బీలో మాజీ ఛాంపియన్లు న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇంగ్లండ్‌తో స్కాంట్లాడ్, ఐర్లాండ్ లీగ్ దశలో తలపడనున్నాయి.
Qualifiers Bangladesh, Ireland, Netherlands and Scotland have been slotted into their groups for T20 World Cup 2026 ✅ pic.twitter.com/nBBcVIdaZA
— ESPNcricinfo (@ESPNcricinfo) February 24, 2026
గ్రూప్ ఏ – భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్.
గ్రూప్ బీ – వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్.
జూన్ 12న ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే ఆరంభ పోరులో ఆతిథ్య ఇంగ్లండ్‌ను శ్రీలంక ఢీకొట్టనుంది. అభిమానులు ఆతృతగా ఎదురూచూసే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 14న జరుగనుంది. మొత్తంగా ఏడు వేదికల్లో 33 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఓల్డ్ ట్రఫోర్డ్, హెడింగ్లే, హ్యాంప్‌షైర్ బౌల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, ఎడ్జ్‌బాస్టన్, ది ఓవల్‌లో లీగ్ దశ, సెమీస్ మ్యాచ్‌లు ఉంటాయి. టైటిల్ పోరును ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఆడిస్తారు.
🚨 Women’s T20 World Cup 2026 🚨
Debutant Netherlands and Bangladesh have been added to Group A while Ireland and Scotland join Group B for the marquee event. The full schedule is out now! pic.twitter.com/bZkf6gqUGu
— Cricbuzz (@cricbuzz) February 24, 2026