Y Satish Reddy | రైతుభరోసా 5 సార్లు ఇవ్వాల్సి ఉంటే రెండు సార్లు ఎగనామం.. మీరు దివానా గాళ్లని ఒప్పుకుంటున్నరా రేవంత్ రెడ్డి..? : వై.సతీష్ రెడ్డి
Y Satish Reddy | అధికారంలోకి రాగానే ఎకరానికి ఏడాదికి రూ.15వేలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. రూ.15 వేలు కాదు కదా.. కనీసం కేసీఆర్ ఇచ్చినట్టుగా రూ.10 వేలు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారని బీఆర్ఎస్ నాయకుడు, రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Y Satish Reddy | రైతుభరోసా ఇవ్వకుండా ఉండటానికి మేమేమ్నా దివానాగాళ్లమా అని ఎన్నికల ముందు చెప్పిన ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి.. ఇప్పుడు తాము దివానాగాళ్లమని ఒప్పుకుంటున్నట్టేనా..? అని బీఆర్ఎస్ నాయకుడు, రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ బుద్ధి ఏంటో తెలుసు కాబట్టే.. వాళ్లు వస్తే రైతుబంధుకు రాం రాం అంటారని.. ఎన్నికల సమయంలోనే తెలంగాణ జాతిపిత కేసీఆర్ స్పష్టంగా చెప్పారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అదే పని చేస్తోందని మండిపడ్డారు.
అధికారంలోకి రాగానే ఎకరానికి ఏడాదికి రూ.15వేలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. రూ.15 వేలు కాదు కదా.. కనీసం కేసీఆర్ ఇచ్చినట్టుగా రూ.10 వేలు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు మొత్తం ఐదు సార్లు రైతుభరోసా ఇవ్వాల్సి ఉంటే.. కేవలం ఒకసారి మాత్రమే రైతుభరోసా ఎకరానికి ఏడాదికి రూ.12 వేలు ఇచ్చారన్నారు . 2023-24 యాసంగి రైతుబంధు కోసం కేసీఆర్ సర్కారు నిధులు సమకూర్చి పెట్టి వెళితే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని కాంట్రాక్టర్లకు ఇచ్చిందని ఆరోపించారు.
డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతుబంధు.. మే నెల వరకు ఇచ్చారని… అప్పుడు కూడా లోక్ సభ ఎన్నికలు ఉండటంతో ఇచ్చారని చెప్పారు. 2024 వానాకాలం పూర్తిగా ఎగ్గొట్టారని తెలిపారు. ఇక 2024-25 యాసంగికి మూడెకరాల వరకు ఇచ్చి మిగతా వారికి ఎగ్గొట్టారని వివరించారు. ఆ తర్వాత 2025 వానాకాలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు లేదా సర్పంచ్ ఎన్నికలు పెట్టాలనే ఉద్దేశంతో మొటిసారి రైతుభరోసా ఇచ్చారన్నారు. ఇప్పుడు యాసంగి పంటకు వచ్చే సరికి మళ్లీ ఎగనామం పెట్టారని అన్నారు. దానికి కూడా శాటిలైట్ సర్వే అని.. సాగు చేసిన వారికే రైతు భరోసా అని కొర్రీలు పెట్టడంపైనా వై.సతీష్ రెడ్డి మండిపడ్డారు.
రైతులను పూర్తిగా ఆగం చేసిన రేవంత్ రెడ్డి..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వానాకాలం రైతు భరోసా జూన్, జులై నెలల్లో, యాసంగి రైతు భరోసా డబ్బులు డిసెంబర్ నెలలో అందేవని సతీష్ రెడ్డి గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక రైతులను పూర్తిగా ఆగం చేశారన్నారు. పెట్టుబడి సాయం కోసం పెట్టిన పథకాన్ని పూర్తిగా నీరుగారుస్తున్నారని.. పెట్టుబడికి డబ్బుల్లేక రైతులు పంటలు వేయలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక రైతుల బతుకులను పూర్తిగా రోడ్డున పడేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పూర్తిగా రైతు వ్యతిరేకి అని దీని ద్వారా మరోసారి స్పష్టమైందన్నారు.
రేవంత్ రెడ్డి, మంత్రుల సోకులకు ప్రజా ధనాన్ని వృధా చేస్తూ.. రైతుభరోసాతోపాటు ఇతర సంక్షేమ పథకాలను ఎగ్గొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని రైతులను నమ్మబలికి అధికారంలోకి రాగానే రూ.12 వేలకు తగ్గించి.. రైతులను మోసం చేశారన్నారు. ఇప్పుడు పూర్తిగా ఎగ్గొట్టి వారిని నిండా ముంచారన్నారు. ఓ వైపు యూరియా కష్టాలు.. మరోవైపు రైతుభరోసా ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
Read Also :
‘డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వాలి’
Cinema Is Dead | రాజమౌళితో మహేశ్ బాబు ఫైటింగ్.. AIతో సినిమా చనిపోయిందంటూ వర్మ పోస్ట్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

