(Book Festival) విజయవాడతోపాటు రాష్ట్రంలోని పుస్తక ప్రియులకు శుభవార్త. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో 2022 జనవరి 1 నుంచి పుస్తక మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ ప్రారంభించనున్నారు. చుట్టుగుంటలోని శాతవాహన కళాశాల మైదానంలో ఈ నెల 11 వ తేదీ వరకు ఈ మెగా పుస్తక మహోత్సవం కొనసాగనున్నది. ఆంధ్ర ప్రదేశ్‌తోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 300 ప్రచురణలు, ప్రచురణకర్తలు ఈ ఉత్సవంలో పాల్గొననున్నారు.
విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 30 సార్లు పుస్తక మహోత్సవాలు నిర్వహించామని, 31వ ఎడిషన్‌ను జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సొసైటీ అధ్యక్షుడు మనోహర్‌నాయుడు తెలిపారు. పుస్తక మహోత్సవ ఎన్‌క్లోజర్‌కు విజయవాడకు చెందిన నవోదయ పబ్లిషర్స్ దివంగత ఏ రామమోహన్ రావు పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. జనవరి 1న సాయంత్రం 6 గంటలకు పుస్తక మహోత్సవాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభిస్తారని, జనవరి 4న పుస్తక ప్రియుల వాక్, 11న పుస్తకావిష్కరణలు, సదస్సు, సాహిత్య సభలు, వర్క్‌షాప్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్షిక పుస్తక మహోత్సవంపై బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆఫీస్ బేరర్లు బ్రోచర్‌ను విడుదల చేశారు. కొవిడ్ కారణంగా 2020లో పుస్తక మహోత్సవం నిర్వహించలేదు.
చర్మ క్యాన్సర్ ఎందుకు వస్తుందో కారణం తెలిసిపోయింది!
సోరియాసిస్ బాధితులకు గుడ్‌న్యూస్.. శాశ్వత పరిష్కారం దొరికినట్టే
నొప్పి లేని, మచ్చ రాని వీనోట్స్ సర్జరీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..