Space plane | భూకక్ష్యలోకి మళ్లీ చైనా రహస్య అంతరిక్ష విమానం.. సమాచారం ఫుల్ సీక్రెట్..!
Space plane | అంతరిక్ష ప్రయోగాల్లో పొరుగు దేశం చైనా (China) తన దూకుడును కొనసాగిస్తూనే ఉన్నది. తాజాగా తమ రహస్య అంతరిక్ష విమానం (Space plane) షెన్లాంగ్ (Shenlong) ను మరోసారి భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్‌మార్చ్-2 ఎఫ్ (Long March-2F) రాకెట్ సాయంతో ఫిబ్రవరి 7న ఈ స్పేస్ ప్లేన్‌ను అంతరిక్షంలోకి పంపించారు.
Space plane : అంతరిక్ష ప్రయోగాల్లో పొరుగు దేశం చైనా (China) తన దూకుడును కొనసాగిస్తూనే ఉన్నది. తాజాగా తమ రహస్య అంతరిక్ష విమానం (Space plane) షెన్లాంగ్ (Shenlong) ను మరోసారి భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్‌మార్చ్-2 ఎఫ్ (Long March-2F) రాకెట్ సాయంతో ఫిబ్రవరి 7న ఈ స్పేస్ ప్లేన్‌ను అంతరిక్షంలోకి పంపించారు.
చైనా షెన్‌లాంగ్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. అయితే ఈ అంతరిక్ష విమానం ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని చైనా ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచుతోంది. అందుకే ఆ ప్రయోగాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో అంతరిక్షాన్ని మరింత సమర్థంగా వినియోగించుకోవడం, అందుబాటు వ్యయాల్లో ప్రయోగాలను చేపట్టడం లాంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు వీలుగా తాము ఈ అంతరిక్ష విమాన ప్రయోగాలు చేపడుతున్నట్లు బీజింగ్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అయితే విమానం డిజైన్, దాని లక్ష్యాలు, ఎన్ని రోజులు కక్ష్యలో ఉండనుంది అనే వివరాలను మాత్రం చైనా బయటపెట్టడం లేదు. దాంతో పలు దేశాలకు చెందిన అంతరిక్ష నిపుణులు, ట్రాకర్లు భూ కక్ష్యలోని షెన్‌లాంగ్‌ను ట్రాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో చైనా షెన్లాంగ్ మిషన్లు చేపట్టిన సమయంలో విమానం కనిష్ఠంగా రెండు రోజుల నుంచి గరిష్ఠంగా ఎనిమిది నెలల వరకు కక్ష్యలో ఉన్నట్లు వారు గుర్తించారు. అది కక్ష్యలోకి చిన్న ఉప గ్రహాల వంటి వాటిని విడుదల చేయడం గమనించినట్లు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

