Motorcycle Diarys | క్రేజీ కాంబో.. రిషబ్ శెట్టి, నాగవంశీ కలయికలో ‘మోటార్‌సైకిల్ డైరీస్’!
Naga Vamsi | తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments), 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టికి చెందిన 'రిషబ్ శెట్టి ఫిల్మ్స్' (Rishab Shetty Films) సంస్థలు కలిసి ఒక ఆసక్తికరమైన కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి.
తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments), ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టికి చెందిన ‘రిషబ్ శెట్టి ఫిల్మ్స్’ (Rishab Shetty Films) సంస్థలు కలిసి ఒక ఆసక్తికరమైన కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి. హృదయాన్ని హత్తుకునే ఒక అందమైన ప్రయాణంగా రూపొందనున్న ఈ చిత్రానికి ‘మోటార్‌సైకిల్ డైరీస్’ (MotorcycleDiarys) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. “ప్రతి మైలురాయీ ఓ జ్ఞాపకం, ప్రతి మలుపూ ఓ కథ.. కొన్ని ప్రయాణాలు మనల్ని పూర్తిగా మార్చేస్తాయి! మా తదుపరి ప్రయాణాన్ని సగర్వంగా ప్రకటిస్తున్నాము. హైవేపైకి రావడానికి సిద్ధంగా ఉండండి, షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది” అంటూ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
సూర్యదేవర నాగవంశీ, ప్రగతి రిషబ్ శెట్టి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శివ చిరంతన (Shivaa Chiranthanaa) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, ధరణి గంగేపుత్ర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. బైక్ ప్రయాణం నేపథ్యంలో భావోద్వేగాలు, జీవిత పాఠాలతో సాగే ఈ కథ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది.
ప్రతి మైలురాయీ ఓ జ్ఞాపకం, ప్రతి మలుపూ ఓ కథ. 🏍️❤
Some journeys change who you are! 🛣️
Sithara Entertainments & Rishab Shetty Films proudly present #MotorcycleDiarys our next soulful journey! 🎬
Get ready to hit the highway! 🔥
Shoot begins soon…🎥@shetty_rishab @vamsi84
@PragathiRShetty
#ShivaaChiranthanaa @gvprakash @NavinNooli #BhuvanReddy @DharaniGange91 @SitharaEnts @rishabsfilms— Sithara Entertainments (@SitharaEnts) November 29, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rishab Shetty | రిషబ్ శెట్టి, నాగవంశీ కాంబినేషన్లో కొత్త సినిమా.. ‘మోటార్‌సైకిల్ డైరీస్’ ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా!
IFFI 2026 | గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినిమా సత్తా: ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి.. ‘హనుమాన్ అంశ్’ దర్శకుడికి ప్రతిష్ఠాత్మక పురస్కారం!
Meenakshi Chaudhary | పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి.. !
INDIA alliance | డీలిమిటేషన్ బిల్లు వేళ కాంగ్రెస్ హై కమాండ్ కీలక నిర్ణయం.. స్టాలిన్, పవార్‌తో చర్చించనున్న ఇండియా కూటమి నేతలు
US Accident | అమెరికాలో ప్రమాదం.. జలపాతంలో పడి టీడీపీ నేత కుమారుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

