(Babu Demand) అమరావతి : వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తాజాగా కర్నూలు జిల్లా కోస్గిలో టీడీపీ నేత తిక్కారెడ్డిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తిక్కారెడ్డిపై దాడి చేసిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ గౌతమ్ సవంగ్కు చంద్రబాబు లేఖ రాశారు. బొంపల్లెలోని ఆలయానికి వెళ్తున్న తిక్కారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలైనట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్యాలను అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తిక్కారెడ్డికి తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో తిక్కారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని నాయుడు గుర్తుచేశారు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. తిక్కారెడ్డికి ఎలాంటి ఆపద జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే మరిన్ని నేరాలకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు.
చర్మ క్యాన్సర్ ఎందుకు వస్తుందో కారణం తెలిసిపోయింది!
సోరియాసిస్ బాధితులకు గుడ్న్యూస్.. శాశ్వత పరిష్కారం దొరికినట్టే
నొప్పి లేని, మచ్చ రాని వీనోట్స్ సర్జరీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..