(ATM theft) కడప : జిల్లాలో సంచలనం సృష్టించిన రెండు ఏటీఎంలలో దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ జరిగిన నాలుగు రోజుల్లోనే దొంగలను పట్టుకోవడం విశేషం. వీరి నుంచి రూ.9.5 లక్షల నగదుతోపాటు ఒక లారీ, రెండు నాటు తుపాకులు, దాదాపు 20 కిలోల గంజాయి, రెండు చిన్న గ్యాస్ సిలిండర్లు, ఒక ఎల్పీజీ సిలిండర్, 40 ఇతర రాష్ట్రాల మద్యం బాటిళ్లు, గ్యాస్ కట్టర్, రెండు నిచ్చెనలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులు హర్యానాకు చెందిన కరుడు గట్టిన మేవాత్ గ్యాంగ్ నేరగాళ్లుని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. తక్కువ సమయంలో ఏటీఎం దొంగలను పట్టుకోవడంలో విశేషంగా కృషి చేసిన సిబ్బందిని అభినందించారు.
చింతకొమ్మ దిన్నె మండలంలోని కేఎస్ఆర్ఎం కళాశాల సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంతోపాటు కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మరో ఎస్బీఐ ఏటీఎంలోనూ చోరీ జరిగింది. ఈ రెండు దొంగతనాలకు పాల్పడింది ఒకే ముఠాకు చెందిన వారిగా కడప పోలీసులు గుర్తించారు. ఈ మేవాత్ గ్యాంగ్‌గా పిలిచే ఈ నేరస్తులు ఆంధ్రప్రదేశ్‌లోని కడప, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో జరిగిన చోరీలకు సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కూడా చోరీలు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. చోరీ అనంతరం లారీల్లో తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ముఠా నాయకుడు రాజస్థాన్‌కు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
చర్మ క్యాన్సర్ ఎందుకు వస్తుందో కారణం తెలిసిపోయింది!
సోరియాసిస్ బాధితులకు గుడ్‌న్యూస్.. శాశ్వత పరిష్కారం దొరికినట్టే
నొప్పి లేని, మచ్చ రాని వీనోట్స్ సర్జరీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..