(Errabelli) న్యూఢిల్లీ: ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ సోమవారం గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. కేంద్రానికి వినిపించేలా చావు డప్పులు కొడుతూ ర్యాలీలు, ఊరేగింపులు జరపాలని సూచించారు. సోమవారం నాడు చేపట్టనున్న నిరసన కార్యక్రమంపై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులతో మంత్రి ఎర్రబెల్లి ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటి నిరసనలను పెద్ద ఎత్తున చేపట్టేలా చూడాలని కోరారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపు మేరకు ప్రతి గ్రామంలో నిరసన కార్యక్రమాలు చేపట్టే విధంగా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని దయాకర్ రావు సూచించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగానికి చేయూతనిస్తూ వ్యవసాయం పండుగగా మారేలా చేసిందని, ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పుష్కలంగా సాగునీరు, రైతు బంధు, సకాలంలో ఎరువులు, విత్తనాలు దొరికేలా కేసీఆర్ చేశారన్నారు. లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయని, రాష్ట్రంలో పంట దిగుబడి గణనీయంగా పెరిగిందని చెప్పారు. వానాకాలం వడ్ల కొనుగోలు విషయంలో అస్పష్టమైన, గందరగోళం కలిగించే ప్రకటనలతో రైతాంగాన్ని కేంద్రం అయోమయపరుస్తుందని దయాకర్ రావు ఆరోపించారు. ఈ విషయంలో ఢిల్లీలో కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రుల బృందం నిలదీస్తుందన్నారు.
తాను ఢిల్లీలో ఉన్నందున ఇక్కడి కార్యక్రమంలో పాల్గొనలేక పోతున్నానని, పాలకుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర రైతాంగాన్ని అయోమయానికి, ఆందోళనకు గురిచేసేలా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరువాడలో చావు డప్పు కార్యక్రమంలో పాల్గొనేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, టీ రాజయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్, ఆరూరి రమేశ్, గండ్ర వెంకటరమణా రెడ్డి, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ , ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..