అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
Best fruits for weight loss: శరీరంలో కొవ్వు పేరుకోవడంవల్ల చాలా మంది అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లే ఈ సమస్యకు ప్రధాన కారణం. కాబట్టి బరువు సమస్య ధరిచేరకుండా ఉండాలన్నా, పెరిగిన బరువును తగ్గించుకోవాలన్నా

హైదరాబాద్: శరీరంలో కొవ్వు పేరుకోవడంవల్ల చాలా మంది అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లే ఈ సమస్యకు ప్రధాన కారణం. కాబట్టి బరువు సమస్య ధరిచేరకుండా ఉండాలన్నా, పెరిగిన బరువును తగ్గించుకోవాలన్నా ముందుగా చేయాల్సింది మన జీవన విధానంతోపాటు ఆహారపు అలవాట్లను మార్చకోవడమే. అంటే శరీరంలో కొవ్వుకు కారణమయ్యే పదార్థాలను దూరం పెడుతూ, కొవ్వు తగ్గించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. కొన్ని రకాల పండ్లలో కొవ్వును తగ్గించే లక్షణాలున్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా..?
కమలా పండ్లు : ఈ పండ్లలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అంతేగాక విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ పండ్లను తినడంవల్ల సులువుగా బరువు తగ్గుతారు.
కివీ పండ్లు: శీతాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లల్లో విటమిన్ సి, ఇ, ఫోలేట్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కొలెస్టరాల్ను అదుపు చేసి బరువును తగ్గించడంలో ఈ పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
అరటి పండ్లు: ఏ సీజన్లో అయినా దొరికే ఈ పండ్లను తీసుకోవడం ద్వారా కూడా బరువు తగ్గొచ్చు. వీటిలో చక్కెర శాతం అధికంగా ఉండడంతో ఇవి తిన్నతర్వాత చాలాసేపటి వరకు ఆకలి వేయదు. పైగా వాటిలోని ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన శక్తినిస్తాయి. తక్కువ మోతాదులో తీసుకున్నా ఎక్కువ శక్తి పొందే అవకాశం ఉన్నందున వీటితో బరువు పెరిగే అవకాశమే లేదు.
ఆపిల్ పండ్లు: ఈ పండ్లు తీసుకోవడంవల్ల రక్తప్రరణ మెరుగుపడుతుంది. అంతేగాక ఈ పండ్లలో నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ పండ్లు తరచూ తినడంవల్ల కూడా సులువుగా బరువు తగ్గవచ్చు.
పుచ్చ పండ్లు: అధికంగా నీటి శాతాన్ని కలిగి వుండే ఈ పండ్లను తినడంవల్ల అవలీలగా బరువు తగ్గుతారు. ఈ పండ్లలో కేలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఒంట్లోని కొవ్వు శాతం బాగా తగ్గుతుంది.
బెర్రీ పండ్లు: యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఎక్కువగా ఉండే బెర్రీస్ని తీసుకోవడంవల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా శరీర బరువూ తగ్గుతుంది.
ద్రాక్ష పండ్లు: ఈ ద్రాక్ష పండ్లలో కూడా నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండ్లు కూడా శరీర బరువు తగ్గించడంలో బాగా ఉపయోగపడుతాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Apple
- Best fruits
- kiwis
- Weight loss
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

