Shining Mask: కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
Shining Mask: జపాన్‌లోని క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కరోనా ఇన్ఫెక్షన్ను గుర్తించడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నారు. కొత్తరకం మాస్క్‌ను వీరు సిద్ధం చేశారు. ఈ మాస్క్ ధరించిన...

(Shining Mask) గత రెండేండ్లుగా ఇబ్బందిపెడుతున్న కొవిడ్ రోజుకో కొత్త రూపం సంతరించుకుంటున్నది. ఫలితంగా ఎప్పుడు ఏరూపంలో ఏవైపు నుంచి వస్తుందో అని ప్రజలు భయపడిపోతున్నారు. కొవిడ్ వైరస్ మన కంటికి కనిపించకపోవడంతో దాని నుంచి దూరంగా ఉండలేకపోతున్నాం. అయితే, ఆవైరస్ మనకు చేరిందీ లేనిదీ కనిపెడితే.. వావ్! భళే ఐడియా కదూ.. అచ్చం ఇలాగే ఆలోచించిన జపాన్‌లోని క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కరోనా ఇన్ఫెక్షన్ను గుర్తించడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నారు. కొత్తరకం మాస్క్‌ను వీరు సిద్ధం చేశారు. ఈ మాస్క్ ధరించిన వ్యక్తికి కొవిడ్-19 సోకిందో లేదో మొబైల్ ఫ్లాష్‌లైట్ ద్వారా తెలుసుకునే వీలుంది. అల్ట్రా వైలెట్ లైట్ కింద కూడా దీన్ని గుర్తించవచ్చు. గమ్మత్తేమిటంటే, ఈ మాస్క్ ఫిల్టర్‌ను ఆస్ట్రిచ్ (ఉష్ట్ర పక్షి) కణాల నుంచి తయారు చేయడం. ప్రభుత్వం ఆమోదించినట్లయితే వచ్చే ఏడాది దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు.
మాస్క్ పొరల్లో ఫిల్టర్ ఉండి.. దానిపై ఫ్లోరోసెంట్ స్ప్రే అద్దుతారు. ఇది వైరస్‌తో బంధించే యాంటీబాడీలను కలిగి ఉంటుంది. మాస్క్‌పై వైరస్ కణాలు చేరగానే ఈ ఫిల్టర్ మెరుస్తుంది. ఈ రకం మాస్క్‌ను ఉపయోగించి కొవిడ్ వైరస్ సోకిందీ లేనిదీ ఇంట్లో కూర్చునే తెలుసుకోవచ్చు. శాస్త్రవేత్తలు తొలుత ఆడ ఉష్ట్ర పక్షికి కరోనా వైరస్‌ను ఇంజెక్ట్ చేశారు. అనంతరం దాని గుడ్ల నుంచి యాంటీబాడీలను తొలగించి ఫ్లోరోసెంట్ స్ప్రే తయారు చేశారు. ఉష్ట్ర పక్షిలో ఉండే యాంటీబాడీలు అనేక రకాల వైరస్లు, బ్యాక్టీరియాలను సమర్థంగా ఎదుర్కొంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
32 మంది రోగులపై చేసిన పరిశోధన విజయవంతమైందని, మాస్క్ ట్రయల్ కేవలం 10 రోజుల్లోనే జరిగిందని అధ్యయనానికి నాయకత్వం వహించిన శాస్త్రవేత్త యసుహిరో సుకమోటో చెప్పారు.
150 మందిపై తదుపరి ట్రయల్స్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

