Health tips | ఆ ఆరోగ్య సమస్యలకు పుదీనాతో చక్కటి పరిష్కారం.. తెలుసా..?
Health tips | ప్రకృతిలో సహజంగా లభ్యమయ్యే మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అంతేగాక ఆరోగ్యపరంగా ఒక్కో మొక్కకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అదేవిధంగా పుదీనా (Mint leaf) తో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తరచూ వంటల్లో పుదీనాను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ పుదీనాలో లెక్కలేనన్ని ఔషధ గుణాలున్నాయి.
Health tips : ప్రకృతిలో సహజంగా లభ్యమయ్యే మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అంతేగాక ఆరోగ్యపరంగా ఒక్కో మొక్కకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అదేవిధంగా పుదీనా (Mint leaf) తో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తరచూ వంటల్లో పుదీనాను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ పుదీనాలో లెక్కలేనన్ని ఔషధ గుణాలున్నాయి. ఇందులో కాల్షియం (Calcium), ఫాస్ఫరస్ (Paspherus) మూలకాలు, సీ, డీ, ఈ, బీ విటమిన్లు (Vitamins) పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అనారోగ్యాన్ని దరిచేరనివ్వవు. ఆరోగ్యపరంగా పుదీనాతో ఎన్ని లాభాలున్నాయో ఇప్పుడు చూద్దాం..
ప్రయోజనాలు..
పుదీనా ఆకులను తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల కడుపుబ్బరం, వికారం లాంటి సమస్యలు తగ్గుతాయి. కడుపులో వికారంగా అనిపించినప్పుడు ఒక కప్పు పుదీనా టీ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
శ్వాస సంబంధమైన సమస్యలకు పుదీనా చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఒక గిన్నెలో వేడినీళ్లు పోసి, దాంట్లో నాలుగైదు చుక్కల పుదీనా నూనె వేసి ఆవిరి పట్టుకుంటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
పుదీనా.. అలర్జీ, ఉబ్బసం లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అందుకే పుదీనాను తరచూ కూరల్లో ఉపయోగించాలి. పుదీనాను పచ్చడి రూపంలో కూడా తీసుకోవచ్చు.
పుదీనా టీ తాగడం ద్వారా జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది.
పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చి పుదీనా ఆకులను తరచూ నమలడంవల్ల నోటిలోని హానికర బ్యాక్టీరియా నశిస్తుంది. దాంతో నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత
Health tips | ఆ ఆరోగ్య సమస్యలకు పుదీనాతో చక్కటి పరిష్కారం.. తెలుసా..?
దీపం వెలిగించి వెళ్లిన కొద్దిసేపటికే అగ్నికి ఆహుతైన ఇల్లు
Deeksha Divas | బీఆర్ఎస్ శ్రేణులంతా దీక్షా దివస్‌లో పాల్గొనాలి.. సీనియర్ నాయకుడు పార్సి రంగారావు పిలుపు
Special Trains | సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

