ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో 21 రద్దు చేయాలని వరుసగా మూడవరోజు పార్ట్ టైం అధ్యాపకులు కేయు పరిపాలనా భవనం ముందు తమ అత్యున్నత విద్యార్హత డాక్టరేట్ని ప్రదర్శిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.
బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా వర్ధన్నపేట నియోజకవర్గం ఆరెపల్లి గ్రామంలోని కాంగ్రెస్, బీజేపీ,సీపీఐ పార్టీల నుంచి 180 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని పోచమ్మ గడ్డ తండాకు చెందిన వర్త్యావత్ యశ్వంత్ నాయక్ గత సంవత్సరం యూపీఎస్ ఫలితాలలో 627 ర్యాంకు సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యారు.
27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
మావోయిస్టు పార్టీ పైన గత కొన్ని నెలలుగా జరుగుతున్న దాడులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వస్తి పలికి శాంతి చర్చలకు ఆహ్వానం పలకాలని తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కార్యదర్శి సుద్దాల నాగరా�