కొత్తగూడెం అర్బన్, జులై 24 : బీఆర్ఎస్ పార్టీ రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ర్ట మాజీ మంత్రి కేటిఆర్ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రామా టాకిస్ ఏరియాలో బీఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పటాకులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపారు.
ఐటీ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా నిలపడంలో విశేష కృషి చేసిన నాయకుడు కేటీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకులు బత్తుల శ్రీను, పిల్లి కుమార్ , బొందుగుల శ్రీధర్, సయ్యద్ హైమద్, నిజాం, గోవర్ధన్, హమీద్, తిరుమలేశ్, లక్ష్మణ్, అబ్బులు, కిరణ్, వెంకటేష్, ఉమా మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.