కార్పొరేషన్ జూలై 24 : కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గరంలోని స్థానిక తెలంగాణ చౌక్‌లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ కేక్‌ను మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు కట్ చేసి సంబురాలు నిర్వహించారు. అనంతరం పూల పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు నిర్వహించారు. అలాగే నగరంలోని వెంకటేశ్వర ఆలయంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పేదలకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు
. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో ఓ గొప్ప నగరంగా తీర్చిదిద్దారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక ఐటీ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడంలో ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, కొత్తపెళ్లి మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మాజీ కార్పొరేటర్లు గుగ్గిళ్ళ జై శ్రీ, గందె మాధవి, నాయకులు ఆరె రవి గౌడ్, వసంతరావు, కర్రే సూర్య శేఖర్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.