వరంగల్, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకొస్తామని సీఎం రేవంత్ స్పష్టంచేశారు. ప్రాజెక్ట్‌లో భాగమైన అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బరాజ్‌లకు మరమ్మతులు చేసి, భవిష్యత్తులో ఎలాంటి ప్ర మాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సాంకేతిక నిపుణులతో చ ర్చిస్తున్నామని, కమిటీలు, ఏజెన్సీలను నియమించామని చెప్పారు. ప్రాజెక్ట్‌పై పూర్తిస్థాయి అధ్యయనం చేస్తున్నామని వివరించారు. ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్ట్‌ను సీఎం రేవంత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అంతకుముందు సమ్మక్క బరాజ్‌ను పరిశీలించి దేవాదులపై మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. అనంతరం దేవాదుల పంప్‌హౌస్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి దేవాదులను పూర్తి చేసి, ఐదున్నర లక్ష ల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తామని తెలిపారు. ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాలతోపాటు వరంగల్‌కు దేవాదుల నుంచే తాగునీరు అందుతుందని, ప్రాజెక్ట్‌పై ప్రణాళికతో ముందుకు పోతున్నామని చెప్పారు.
ఈ ఏడాది జూన్ 2లోగా దేవాదుల ప్రాజె క్టు నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ కోసం రూ.600 కోట్ల నిధులను మంజూరు చేస్తామని సీఎం తెలిపారు. భూ సేకరణలో జాప్యం వల్ల ప్రాజెక్ట్ పనులు ఆగకూడదని స్పష్టంచేశా రు. అన్ని ప్రాజెక్టుల భూ సేకరణకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. నెల రోజు ల్లో దేవాదుల పంప్‌హౌస్‌కు మరమ్మతులు చేస్తామని వివరించారు.
80% పూర్తయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్పారు. రామప్ప చెరువు నుంచి జంపన్న వాగుకు నీరందించే ప్రణాళికలపై నివేదిక అందించాలని ఆదేశించారు. 1994 నుంచి టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్కు పదేండ్ల పాటు అధికారం ఇచ్చారని, 2034 దాకా తామే అధికారంలో ఉంటామని చెప్పుకొచ్చారు. విలేకరుల సమావేశంలో మంత్రు లు ఉత్తమ్, సీతక్క, పొంగులేటి, ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు.
రూ.వేల కోట్లతో కట్టిన కాళేశ్వరంను వినియోగంలోకి తెస్తాం. ఏ బరాజ్నూ గాలికి వదిలేయం. సాంకేతిక నిపుణుల తో చర్చిస్తున్నాం. కమిటీలతో మాట్లాడుతున్నాం. ఏజెన్సీలను నియమించాం. భూమి మీద కనిపించేది మాత్రమే కుంగింది. నీటి లోపలి సమస్యలపై అధ్యయనం చేయాలి. ప్రజల సొమ్ముతో కట్టిన అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బరాజ్‌లకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకొస్తాం.
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి