సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. అలాంటి వాటిలో నాని-కీర్తిసురేష్ కాంబో ఒకటి. ఇప్పటికే ఈ జోడీ నేను లోకల్, దసరా వంటి హిట్ చిత్రాల్లో ప్రేక్షకుల్ని అలరించారు. తాజాగా ఈ జంట మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. నాని తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ ఓ ప్రత్యేకగీతంలో నర్తిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్లో వేసిన ఓ స్పెషల్ సెట్లో ఈ పాటతో పాటు కొన్ని సన్నివేశాలను నాని-కీర్తిసురేష్లపై తెరకెక్కిస్తున్నారని సమాచారం.
‘దసరా’ చిత్రంలో పల్లెటూరి అమ్మాయి వెన్నెల పాత్రలో కీర్తిసురేష్ అభినయం అందరిని ఆకట్టుకుంది. నానితో ఆమె కెమిస్ట్రీ హైలైట్గా నిలిచింది. ఈ నేపథ్యంలో మరోమారు ఈ భామ నానితో కలిసి నటిస్తుండటం విశేషం. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్నది. సికింద్రాబాద్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.