నాగర్‌కర్నూల్/ వనపర్తి టౌన్, జూలై 28 : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిలు పరామర్శించారు. నరేందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిల మాతృమూర్తి పట్నం రుక్కమ్మ మృతి చెందడంతో మంగళవారం షాబాద్‌లోని వారి ఇంటికి వెళ్లి ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మా జీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పరామర్శించిన వారిలో నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
వనపర్తి టౌన్, జూలై 28 : నికార్సైయిన ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజలకు సేవలు అందించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆకాంక్షించారు. సికింద్రాబాద్‌లోని యశోధ దవాఖానలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్‌రెడ్డిని మంగళవారం మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. అదేవిదంగా సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొని, ఆయన త్వరగా కోలుకొని ము నుపటిలాగే ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమంలో విశేష పాత్ర పోషించిన నికార్సైయిన ఉద్యమ నాయకుడిగా ఆయన మరింత కాలం ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకున్నట్లు చెప్పారు. ఆయన వెంట వనపర్తి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.