ప్రభు, హరిప్రియ జంటగా నటించిన చిత్రం ‘తీరం’. వంశీ మునగాల దర్శకుడు. ఉపేంద్ర గంగావెల్లి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ‘పుష్ప’ఫేం జగదీశ్, ఫన్ బకెట్ మహేశ్ విట్ట, నటులు రాజ్‌కుమార్ కసిరెడ్డి, దర్శకుడు ప్రసాద్, జబర్దస్త్ సద్దాం ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి పాటను ఆవిష్కరించారు.
హృదయాలను తాకే భావోద్వేగభరితమైన కథ ఇదని, ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందని దర్శకుడు తెలిపారు. విడుదల తేదీతోపాటు ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తామని నిర్మాత చెప్పారు. అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు హీరోహీరోయిన్లు ప్రభు, హరిప్రియ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అబ్దుల్ వాలి, సంగీతం: సాధ్విక్ సన్స్, నిర్మాణం: శ్రీభవాని క్రియేషన్స్.