న్యూఢిల్లీ: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) మళ్లీ గాయపడ్డాడు. కొత్తగా అతని కుడి కాలికి గాయమైంది. దీంతో న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌కు అతను దూరం కానున్నాడు. బెంగుళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్న హార్దిక్ పాండ్యా.. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయంతో ఇబ్బందిపడ్డాడు. కుడి కాలి మోకాలు కింద భాగంలో అతనికి తీవ్రంగా నొప్పి వచ్చింది. అయితే స్కానింగ్ రిపోర్టుల ఆధారంగా అతను కనీసం మూడు వారాల పాటు రెస్టు తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి సెప్టెంబర్ 20వ తేదీనే అతను భారత జట్టుతో కలవాల్సి ఉంది. ఇక అక్టోబర్ 6వ తేదీ నుంచి ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగే వన్డే సిరీస్‌కు అతను ఎంపికయ్యాడు. కానీ తాజా స్కానింగ్ రిపోర్టు వల్ల అతను క్రికెట్‌కు దూరం కావాల్సి వస్తోంది. బీసీసీఐ మెడికల్ ప్యానెల్ హెడ్ డాక్టర్ దిన్షా పర్దివాలా ఆ రిపోర్టులను పరిశీలించారు.
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్ అక్టోబర్ 22వ తేదీ నుంచి ప్రారంభంకానున్నది. ఆ తర్వాత వన్డే సిరీస్ జరుగుతుంది. అయితే అప్పటి వరకు హార్దిక్ పాండ్యా కోలుకోవడం అసంభవంగా కనిపిస్తున్నది. వాస్తవానికి ఆసియా గేమ్స్‌లో ఆడేందుకు పాండ్యా జపాన్ వెళ్లాలని బీసీసీఐ భావించింది. వీసా వర్క్ కోసం అతని పాస్‌పోర్టు కూడా తీసుకున్నది. కానీ ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు అతను సడెన్‌గా నొప్పితో బాధపడ్డాడు. కొన్ని రోజుల పాటు రెస్టు తీసుకోవాలని అతనే భావించాడు. అయితే ఫిట్నెస్ పరీక్షలో అతనికి మళ్లీ నొప్పి రావడంతో కివీస్ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వస్తోంది. ఒకవేళ ఫిట్ అయితే పాండ్యా మళ్లీ జింబాబ్వేతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం ఉంటుంది.