పెద్దకొత్తపల్లి : నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 50 మంది ఈ- పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు మూడు నెలల వేతనాలు చెల్లించాలని ఈ -పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాలుకు జిల్లా ఈ -పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ.. మూడు నెలల నుండి వేతనాలు అందరికి పోవడంతో కుటుంబ పోషణ భారంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రతి నెల ఉద్యోగులకు వేతనాల అందజేస్తున్నామని పేర్కొంటున్నారు. కానీ, మాలాంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి అధికారులు మా వినతిని పరిశీలించి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేసి మా కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈ -కంప్యూటర్ ఆపరేటర్లు హసన్, స్వప్న, రాము, సురేష్ వివిధ మండలాల ఉద్యోగులు ఉన్నారు.