The Paradise | నాచురల్ స్టార్ నాని హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ది పారడైజ్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ సాంగ్ ‘ఆయా షేర్’ రీసెంట్గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే సోషల్ మీడియాలో వివాదానికి కూడా దారి తీసింది. ‘ఆయా షేర్’ పాట వినగానే హుక్ అయ్యేలా ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మాస్ బీట్, విజువల్స్, నాని స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని కలిసి పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా నాని చేసిన డాన్స్ మూమెంట్స్ అభిమానులను మెప్పిస్తున్నాయి. అయితే ఈ పాటపై కొందరు నెటిజన్లు నెగిటివ్ ప్రచారం చేయడం గమనార్హం.
ఈ తెలుగు పాటను మలయాళం స్టైల్ అంటూ ట్రోల్ చేయడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. అంతేకాదు, నాని చేసిన డాన్స్ స్టెప్స్‌పై కూడా విమర్శలు వస్తున్నాయి. కొంతమంది మాత్రం ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్ కోసం చేస్తున్న ట్రోలింగ్ మాత్రమేనని, పాటకు మంచి స్పందన వస్తోందని పేర్కొంటున్నారు. ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గత చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది. నాని కూడా ఇటీవల భిన్నమైన కథలను ఎంచుకుంటూ తన కెరీర్లో కొత్త దిశగా అడుగులు వేస్తున్నారు.
టాలీవుడ్ నుంచి మంచి కంటెంట్ వస్తే దానిని ప్రోత్సహించాలే గానీ, అవసరం లేకుండా ట్రోల్ చేయడం సమంజసం కాదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో మంచి వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మొత్తానికి, ‘ఆయా షేర్’ పాటకు ఒకవైపు ప్రశంసలు, మరోవైపు ట్రోల్స్ రావడం సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇక ఈ చిత్రంలోని తదుపరి అప్డేట్స్ ఎలా ఉంటాయో చూడాలి. మూవీని ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం భారీ హిట్ కొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.