Teja Sajja | పాపులర్ ఒటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంటర్నేషనల్ రియాలిటీ గేమ్ షో ‘ది ట్రైటర్స్’ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్ విషయం తెలిసిందే. టాలీవుడ్ యాక్టర్ తేజ సజ్జ ఈ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోకు మంచి స్పందన వస్తోంది.
పూర్తిగా మోసాలు, వ్యూహాలు, రహస్య కూటములు, ఊహించని మలుపుల ఆధారంగా ఈ హై-వోల్టేజ్ గేమ్ షో సాగనుందని ప్రోమో ద్వారా అర్థమవుతోంది. కాగా ఈ గేమ్ షోకు తేజ సజ్జ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజా కథనాల ప్రకారం తేజ సజ్జ ఓ సినిమాకు ఎంత తీసుకుంటాడో దానికి సమానంగా ఈ షోకు అందుకుంటున్నాడని టాక్. అంతేకాదు ఈ గేమ్ షో కోసం తేజ సజ్జ సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్‌ను మించి ఎక్కువగా తీసుకుంటున్నాడని కూడా మరో అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది
ఈ గేమ్ షోలో కొందరు కంటెస్టెంట్స్ ఇన్నోసెంట్స్గా ఉంటే, మరికొందరు ట్రైటర్స్గా వ్యవహరిస్తారు. ట్రైటర్స్ ఎవరనేది కనిపెట్టడానికి ఇన్నోసెంట్స్ చేసే ప్రయత్నాలు, మధ్యలో జరిగే ఉత్కంఠభరితమైన డ్రామా ప్రేక్షకులను ఎంటర్టైన్చేయబోతున్నాయని ప్రోహో హింట్ ఇచ్చేస్తుంది. ఈ షో అక్టోబర్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది.