Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 28వ రోజు ఊహించిన పరిణామమే చోటుచేసుకుంది. ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్‌లో ఉన్న వారిలో చివరికి సృష్టి వ్యాకరణం, షాలిని మాత్రమే మిగలగా.. నాగార్జున సృష్టి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో సృష్టి బిగ్‌బాస్ హౌస్ ప్రయాణం ముగిసింది. సృష్టి ఎలిమినేషన్‌తో షాలిని భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. ఆదివారం కావడంతో ఎలిమినేషన్ ప్రక్రియతో పాటు నాగార్జున హౌస్‌మేట్స్‌తో సరదా టాస్క్‌లు కూడా చేయించారు. నామినేషన్స్‌లో ఉన్న సభ్యులను ఒక్కొక్కరినీ సేవ్ చేస్తూ చివరికి సృష్టి, షాలినిని మాత్రమే మిగిల్చారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు హౌస్‌లో కొనసాగుతారనే ఉత్కంఠ నెలకొంది.
అయితే చివరకు అందరూ ఊహించినట్టుగానే సృష్టి ఎలిమినేట్ అయ్యారు. నాగార్జున ఈ విషయాన్ని ప్రకటించగానే హౌస్‌లోని సభ్యులు ఆమెకు వీడ్కోలు పలికారు. ఎలిమినేషన్‌కు ముందు హౌస్‌మేట్స్‌ను కొన్ని గ్రూపులుగా విభజించి ఓ ప్రత్యేకమైన టాస్క్ నిర్వహించారు. ఒక్కో గ్రూప్‌కు ఒక కెప్టెన్‌ను నియమించి.. ఓడ మునిగిపోయే పరిస్థితి వస్తే ఒకరిని కాపాడి, మరొకరిని ముంచాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారో చెప్పాలని నాగార్జున సూచించారు.ఈ టాస్క్‌లో నరేష్, దేబ్జానీ, రామ్ ప్రసాద్ ఒక టీమ్‌గా ఉండగా.. నరేష్ ఆ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఎవరిని ముంచుతారని అడిగినప్పుడు రామ్ ప్రసాద్ పేరును నరేష్ చెప్పాడు. రామ్ ప్రసాద్ ఇటీవల కొంత తొందరపడుతున్నారని, గేమ్‌ను మధ్యలోనే వదిలేస్తున్నారని అందుకు కారణంగా పేర్కొన్నారు.
మరోవైపు ఝాన్సీ, షాలిని, రోహిత్ ఒక టీమ్‌గా ఉండగా.. షాలిని కెప్టెన్‌గా వ్యవహరించింది. ఈ టాస్క్‌లో ఎవరిని ముంచుతారని అడిగితే షాలిని ఏమాత్రం ఆలోచించకుండా ఝాన్సీ పేరును చెప్పింది.ఝాన్సీని ఎందుకు ఎంచుకున్నావని చెప్పే క్రమంలో షాలిని చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తిని రేకెత్తించాయి. రోహిత్‌తో జీవితాంతం కలిసి ఉండాలనే తన మనసులోని మాటను ఆమె చెప్పకనే చెప్పినట్లుగా అనిపించింది. దీంతో హౌస్‌లో రోహిత్, షాలిని మధ్య ఉన్న బంధంపై మరోసారి చర్చ మొదలైంది. అయితే సృష్టి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించగానే షాలిని కన్నీళ్లు పెట్టుకుంది. తోటి ఇంటి సభ్యులు కూడా సృష్టికి వీడ్కోలు పలికారు. అనంతరం స్టేజీపైకి వచ్చిన సృష్టి.. బిగ్‌బాస్ హౌస్‌లో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది.
ఈ సందర్భంగా హౌస్‌లో ఇంకా ముసుగు వేసుకుని గేమ్ ఆడుతున్న వారు ఎవరు అని సృష్టిని అడిగారు. అందుకు ఆమె ముకేశ్, రామ్ ప్రసాద్ పేర్లు చెప్పింది.ముకేశ్ ఎలాంటి గేమ్ ఆడుతున్నారో ఎవరికీ అంత సులభంగా అర్థం కాదని, తనదైన వ్యూహంతో ముందుకు వెళ్తారని సృష్టి అభిప్రాయపడింది. ఇక రామ్ ప్రసాద్ విషయంలో.. అగ్గిపుల్ల అంటించినట్టుగా పరిస్థితిని క్రియేట్ చేసి, ఆ తర్వాత సైలెంట్‌గా వెళ్లిపోతారని వ్యాఖ్యానించింది.