Janhvi kapoor | దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్ ‘చుట్టమల్లే’ పై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఏఐ మార్ఫింగ్ వీడియో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ సాంగ్‌లో జాన్వీ కపూర్ కనిపించిన సన్నివేశాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి అత్యంత అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడం పట్ల తారక్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు.
టెక్నాలజీని ఉపయోగించి మహిళలను అభ్యంతరక రీతిలో వారి ప్రమేయం, అనుమతి లేకుండా ఫిక్షనల్ కంటెంట్‌ను వ్యాప్తి చేయడం తీవ్రమైన ఉలంఘన, లైంగిక దాడికి సమానమైన చర్యగా అభిప్రాయపడ్డది. వ్యక్తిగత హద్దులను ఎప్పుడూ గౌరవించాలన్నది. ఒక మహిళ ఏం ధరించినా లేదా ఆమె ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సరే.. అంటే ఆమె వరుసగా 5 రోజులు అవునని చెప్పి, ఆరో రోజు కాదని చెప్పినా.. ఆ కాదని చెప్పిన విషయాన్ని గౌరవించాలంది. తాను ఎదుర్కొంటున్న ఏఐ వీడియోలకే ఈ సమస్య పరిమితం కాదని, మహిళలు ప్రతీ రోజూ ఎదుర్కొంటున్న విమర్శలు, భద్రతకు సంబంధించిన ఆందోళనలాంటి వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తుందని పేర్కొంది.
ఏఐ వీడియో విషయంలో సీరియస్‌గా స్పందించడం పట్ల జాన్వీకపూర్ జూనియర్ ఎన్టీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా గళం విప్పిన చిరంజీవి, విజయ్ ఖుష్బులను అభినందించిన జాన్వీకపూర్.. “ ఆమె శరీరం.. ఆమె ప్రతిబింబం, ఆమె హద్దులు.. ఆమె చాయిస్..” అంటూ తన స్టేట్మెంట్ను ముగించింది.
ఈ క్రమంలో జాన్వీ కపూర్ AI వీడియోపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేశారు. ఏఐ మార్పింగ్ వీడియోల వెనుకున్నదెవరు, ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు సమాచారం.
