Atlee | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సినిమా చేస్తున్నాడంటూ చాలా కాలంగా క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట రౌండప్ చేస్తుందని తెలిసిందే. అయితే ఇంతకీ తలైవాతో అట్లీ మూవీ చేసే అవకాశాలున్నాయా..? అంటూ చర్చ కూడా జరుగుతోంది.. ఈ క్రమంలో తలైవాతో సినిమాపై అట్లీ ఓపెన్ అయ్యాడు.
ఓ ఈవెంట్లో అట్లీ మాట్లాడుతూ.. నేను సాధారణంగా సినిమా సినిమాకు మధ్య లాంగ్ టైం తీసుకుంటా.. స్క్రిప్టింగ్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి వస్తుందన్నాడు. అట్లీ ఇప్పటికే రాకా సినిమాతోపాటు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నేపథ్యంలో రజినీకాంత్ ప్రాజెక్ట్‌ను ఎప్పుడు తీసుకుంటాననేది అంచనా వేయడం కష్టమని హింట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో చేస్తున్న రాకా సినిమా షూటింగ్ దశంలో ఉండగా.. మూవీని పూర్తి చేసే పనితతో బిజీగా ఉంది అట్లీ టీం. రజనీకాంత్‌తో సినిమా ఎప్పుడుంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు, మూవీ లవర్స్‌కు.. ఇప్పటికిప్పుడు అలాంటి ప్లాన్ ఏం లేదంటూ కొట్టిపారేశాడు అట్లీ .
రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ సీక్వెల్ ప్రాజెక్టు జైలర్ 2లో నటిస్తున్నాడు.. ఈ మూవీ అక్టోబర్ 15న విడుదల కానుంది. మరోవైపు యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ధర్మన్‌లో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. శంకర్ డైరెక్షన్లోరజినీకాంత్ టైటిల్ రోల్లో తెరకెక్కిన హిట్ మూవీ రోబోకు అట్లీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడని తెలిసిందే.