వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ఇవాళ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. మిలాన్ కోర్టినా ఒలింపిక్స్ పురుషుల హాకీ ఈవెంట్లో అమెరికాకు స్వర్ణ పతకం అందించిన గోల్‌కీపర్ కొన్నార్ హెల్లిబక్‌కు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం అవార్డును ఇవ్వనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆ ఒలింపిక్స్‌లో కెనడాతో జరిగిన గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో హెల్లిబక్ కీలక పాత్రను షోపించాడు. గోల్‌కీపర్‌గా అతను 41 గోల్స్‌ను సేవ్ చేశాడు. దీంతో మ్యాచ్ 1-1తో టై అయ్యింది. అయితే ఆ తర్వాత జాక్ హ్యూగ్స్ ఓ గోల్ స్కోరు చేయడంతో అమెరికా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నది. సెకండ్ హాఫ్‌లో తన స్టిక్‌తో హెల్లిబక్ గోల్‌ను ఆపడం మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఒకవేళ ఆ గోల్‌ను సేవ్ చేయకుంటే, అప్పుడు పరిస్థితి మరోలా ఉండేది. ఐస్ హాకీలో చాన్నాళ్ల తర్వాత అమెరికా జట్టు గోల్డ్ మెడల్‌ను సాధించింది. దీంతో ప్రస్తుతం అమెరికా జట్టుపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి.