హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇండ్లే లక్ష్యంగా చేసుకొని 11 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. పలు ఇండ్ల నుంచి ఐదు తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.2.85 లక్షలు దోచుకెళ్లారు.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, పదకొండు ఇండ్లలో ఒకేసారి దొంగతనం జరుగడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. దొంగలను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు.