చండీగఢ్: ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించడం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారం హర్షం వ్యక్తం చేస్తూ ‘సత్యం ఎప్పుడూ గెలుస్తుంది’ అని పేర్కొన్నారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆప్ కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. కార్యకర్తలు, నేతలు స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేయగా, మరికొందరు డప్పు చప్పుళ్ల మధ్య నృత్య్లాలు చేశారు.
కోర్టు తీర్పును పంజాబ్ ఆప్ అధ్యక్షుడు, మంత్రి అమన్ అరోరా స్వాగతిస్తూ ఈ తీర్పు ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిన విషయం వెల్లడైందన్నారు. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని ఆప్, కేజ్రీవాల్ పరువును తీయడానికి కేంద్రం ప్రయత్నించిందన్నారు.
