తిమ్మాపూర్, జులై24 : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామంలోని అనుబంధ పల్లె గోసంగి వాడలో కొద్ది రోజులుగా మంచి నీటి సమస్య తలెత్తింది. వీధిలోని బోరు మోటరు చెడిపోవడంతో కొన్ని నెలలుగా పడావుపడిపోయింది. వాడ ప్రజలు ఏ అధికారికి, ఏ నాయకునికి చెప్పినా.. పట్టించుకోలేదు.
వీరి ఇబ్బందులను స్థానికుల ద్వారా తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్.. తన ఖర్చులతో కొత్త మోటర్ కొని అందజేశాడు. దాన్ని బిగించి వాడుకుంటున్న గోసంగి వాడ ప్రజలు రమేష్ కు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.