హైదరాబాద్, ఫిబ్రవరి 20 : హెర్బల్ ఫార్మాస్యూటికల్ బ్రాండ్ రిలీఫ్ వెల్నెస్.. దేశీయ వెల్నెస్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దేశంలో తొలిసారిగా స్మాల్-మాలిక్యూల్ హెర్బల్ ఫార్మాస్యూటికల్ బ్రాండ్‌కు చెందిన 18 రకాల ఔషధాలను ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా కంపెనీ వ్యవస్థాపకుడు డోలేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..కీళ్లు, ఎముకల ఆరోగ్యం, మెటాబాలిక్ వెల్నెస్, జ్ఞాపకశక్తి, మహిళల్లో ఆరోగ్యం, జీర్ణక్రియ, నిద్ర, రోగనిరోధక శక్తి, ఒత్తిడి నిర్వహణ వంటి జీవనశైలి ఆరోగ్య సమస్యలకు రిలీఫ్ వెల్నెస్ ఉత్పత్తులతో పరిష్కారం లభించనున్నదన్నారు.
ప్రస్తుతం 18 రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు, వచ్చే ఆరు నెలల్లో మరో 20-25 రకాల ఔషధాలను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ఔషధాలను తయారు చేయడానికి హైదరాబాద్‌కు సమీపంలోని కర్కపట్ల వద్ద అసెంబ్లింగ్ యూనిట్‌ను నెలకొల్పినట్టు చెప్పారు. ఇప్పటి వరకు రూ.15 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్టు తెలిపారు.