Former Minister Puvvada | ఆదివాసీ గిరిజనుల కలలను సాకారం చేసిన కేసీఆర్ : మాజీ మంత్రి పువ్వాడ
Former Minister Puvvada | ఆదివాసీ గిరిజనుల దశాబ్దాల కలలను, ఆకాంక్షలను సాకారం చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కే దక్కుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు.
ఖమ్మం : ఆదివాసీ గిరిజనుల ( Adivasis Tribals) దశాబ్దాల కలలను, ఆకాంక్షలను సాకారం చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR ) కే దక్కుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ (Former Minister Puvvada ) పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.
ఆదివాసీ గిరిజనుల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని అన్నారు. స్వయంపాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు భూములకు పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేసి గిరిజనుల హక్కులను పరిరక్షించామని తెలిపారు. ‘మా తండాలో మా రాజ్యం’ అనే ప్రజాస్వామిక ఆకాంక్షను సాకారం చేస్తూ అనేక గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని వెల్లడించారు.
అటవీ భూములపై గిరిజనులకు హక్కులు కల్పిస్తూ హక్కు పత్రాలను అందజేశామని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో గిరిజనుల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేసి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామని చెప్పారు. అటవీ ఉత్పత్తులకు ‘గిరి’బ్రాండ్‌ను ప్రోత్సహిస్తూ వాటి విక్రయాలకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించి గిరిజనుల ఆర్థికాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం తోడ్పాటు అందించిందని పేర్కొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

