India A: ఆస్ట్రేలియా-ఏపై 162 రన్స్ తేడాతో భారత్-ఏ గెలుపు
India A: ఆస్ట్రేలియా-ఏతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు 162 రన్స్ తేడాతో విజయాన్ని నమోదు చేసింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షామ్స్ ములానీ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసుకుని ఆసీస్‌ను దెబ్బతీశాడు. ఈ మ్యాచ్‌లో అతను మొత్తం తన ఖాతాలో ఏడు వికెట్లు వేసుకున్నాడు.
పుదుచ్చరి: ఆస్ట్రేలియా-ఏతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-ఏ(India A) జట్టు 162 రన్స్ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షామ్స్ ములానీ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసుకుని ఆసీస్‌ను దెబ్బతీశాడు. ఈ మ్యాచ్‌లో అతను మొత్తం తన ఖాతాలో ఏడు వికెట్లు వేసుకున్నాడు. పుదుచ్చరి సీఏపీ-సీచెమ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇవాళ నాలుగో రోజు 55 రన్స్ వద్ద రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 200 పరుగులకే ఆలౌటైంది. మీడియం పేసర్ అన్షుల్ కాంబోజ్ తొలి సెషన్లో రెండు వికెట్లు తీశాడు. నాథన్ మెక్‌స్వీనీ, పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌ను ఔట్ చేశాడు. ఇవాళ భోజన విరామ సమయానికి 185 రన్స్ కే ఏడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడింది. లంచ్ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది. కుమార కుషాగ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.ఇక రెండో టెస్టు మ్యాచ్‌ను సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 2 వరకు ఆడనున్నారు.ఆ తర్వాత మూడు వన్డేలు ఉంటాయి.
స్కోరు బోర్డు
ఇండియా ఏ 334 & 199
ఆస్ట్రేలియా 171 & 200 (ఓ నీల్ 47, కాంబోజ్2-25, దేశ్‌పాండే 3-14, ములానీ 3-57, కోటియాన్ 2-57)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

