Ambati Rambabu | అంబటి రాంబాబుకు మరోసారి ఈడీ నోటీసులు.. ఈనెల 28న హాజరుకావాలని ఆదేశాలు
Ambati Rambabu | ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం మరోసారి నోటీసులు జారీచేసింది.
అమరావతి : ఏపీ మద్యం రవాణా కుంభకోణం ( Liquor Scam ) కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం మరోసారి నోటీసులు జారీచేసింది. రెండు రోజుల క్రితం ఆయనకు శుక్రవారం ఉ దయం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
తనకు 15 రోజుల క్రితం గుండెకు స్టంట్లు వేయించుకున్నానని, డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం కోలుకుంటున్నానని, తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ తాను విచారణకు రాలేనని వివరించారు. దీంతో శుక్రవారం మరోసారి అంబటికి నోటీలసులు జారీ చేసి సోమవారం రావాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు లిక్కర్ రవాణా కోసం సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టినట్లు ఈడీ గుర్తించింది.
తొలి కాంట్రాక్టు కాలంలో వీరిద్దరూ కలిసి సుమారు 59.14 లక్షల మద్యం పెట్టెలు రవాణా చేశారని అధికారులు గుర్తించారు. సిగ్మా సంస్థ నుంచి రూ.15.44 కోట్లు అందుకున్నట్లు విచారణలో వెల్లడైంది. సబ్కాంట్రాక్టులు, నిధుల మళ్లింపు, అంబటి రాంబాబుతో ఉన్న సంబంధాలపై కూడా వారిని వివరాలు అడిగారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను అధికంగా పెంచడంవల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.195 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ఈడీ లెక్కలు చూపిస్తోంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

