The Paradise | మీ ప్రేమతో పాటు ట్రోల్స్‌ను ఎంజాయ్ చేస్తున్నా.. ‘ది ప్యారడైజ్’ సక్సెస్‌పై నాని ఎమోషనల్ పోస్ట్!
Natural Star Nani | నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'ది ప్యారడైజ్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సినిమా విజయంపై, అలాగే సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై హీరో నాని స్వయంగా స్పందించారు.
Natural Star Nani | నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సినిమా విజయంపై, అలాగే సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై హీరో నాని స్వయంగా స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన, ఎమోషనల్ నోట్‌ను షేర్ చేశారు.
సినిమా చూసిన ప్రేక్షకుల స్పందనలు, రియాక్షన్స్ అన్నీ తాను చూశానని నాని తెలిపారు. ప్రేక్షకులు చూపించిన ప్రేమాభిమానాలతో పాటు, వారు చేసిన నవ్వులు పూయించే హిలేరియస్ ట్రోల్స్‌ను కూడా తాను ఎంతో ఆస్వాదించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు తమ సొంత చిత్రంగా ఓన్ చేసుకున్న తీరు తన మనసును తాకిందని, అలాగే క్రిటిక్స్ మరియు రివ్యూయర్స్ ఎత్తిచూపిన తప్పుల నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని నాని నిజాయితీగా అంగీకరించారు.
అన్నింటికీ ధన్యవాదాలు చెప్పడం ఒక్కటే నేను చేయగలిగిన పని. ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచడం కోసం మేము ఎంతో కష్టపడి, చెమటోడ్చి ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని తెరకెక్కించాము. ఇప్పుడు ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకోవడమో లేదా విమర్శించడమో పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ఈ సినిమాపై మీరు చూపిన ఉత్సాహం, నాపై చూపిన ప్రేమ నన్ను కృతజ్ఞతాభావంతో నింపేశాయి అంటూ నాని తన భావాలను పంచుకున్నారు. ప్రస్తుతం నాని చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
I have seen all your reactions and responses. I’ve received all your love and equally enjoyed your hilarious trolls. I’m heartwarmed by the way audience have owned the film, and also learnt from the flaws that critics and reviewers have pointed out.
Thank you for everything is…
— Nani (@NameisNani) September 25, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

