Health Tips | చిప్స్ తినుకుంటూ కూల్ డ్రింక్స్ తాగితే యమ డేంజర్.. ఎందుకో తెలుసా..?
Health Tips | వేసవిలో చాలామంది చల్లని పానీయాలు తాగడానికి ఇష్టపడతారు. ఇవి చాలా రుచిగా ఉండటంతోపాటు వెంటనే చల్లదనం కూడా ఇస్తాయి. అయితే కొందరు ఈ పానీయాలతోపాటు చిప్స్ కూడా తింటారు. కొందరిలో సాధారణంగా కనిపించే ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Health Tips : వేసవిలో చాలామంది చల్లని పానీయాలు తాగడానికి ఇష్టపడతారు. ఇవి చాలా రుచిగా ఉండటంతోపాటు వెంటనే చల్లదనం కూడా ఇస్తాయి. అయితే కొందరు ఈ పానీయాలతోపాటు చిప్స్ కూడా తింటారు. కొందరిలో సాధారణంగా కనిపించే ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అలవాటు ఉంటే తక్షణమే మానుకోవాలని సూచిస్తున్నారు. కూల్‌డ్రింక్స్‌తో చిప్స్ తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
చల్లని పానీయాలలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కొన్నింటిలో కెఫీన్ కూడా ఉంటుంది. ఇవి తాగినప్పుడు తాత్కాలికంగా దాహం తగ్గినట్లు అనిపించినా, వాస్తవానికి శరీరంలో నీరు తగ్గే అవకాశం ఉంది. అంటే డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల నీరసం, తల తిరగడం, అలసట వంటి సమస్యలు రావచ్చు. వేసవిలో శరీరానికి తగినంత నీరు అవసరం కాబట్టి నీటిని శాతాన్ని తగ్గించ కూల్‌డ్రింక్స్ తాగడం మరింత ప్రమాదకరం.
ఇక చిప్స్ విషయానికి వస్తే.. చిప్స్‌లో ఉప్పు, హానికరమైన కొవ్వులు (ట్రాన్స్ ఫ్యాట్స్) ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో నీటిని తగ్గించడమే కాకుండా, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కూడా దెబ్బతీస్తాయి. దాంతో దాహం మరింత పెరుగుతుంది. ఫలితంగా మళ్లీ మళ్లీ చల్లని పానీయాలు తాగే అలవాటు పెరుగుతుంది. దీర్ఘకాలంలో బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
అందుకే కూల్‌డ్రింక్స్ తరచూ తాగే అలవాటు ఉన్నవాళ్లు వాటికి బదులుగా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి సహజ పానీయాలు తాగడం మంచిది. ఇవి శరీరానికి తేమను అందించి, ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అదేవిధంగా కూల్‌డ్రింక్స్‌తోపాటు చిప్స్‌కు బదులుగా వేయించిన మఖానా, వేరుశెనగలు లేదా తాజా పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

