హైదరాబాద్, ఫిబ్రవరి 20 : అత్యవసర వైద్యసేవల బలోపేతానికి మెడికవర్ హాస్పిటల్స్ మరో ముందడుగు వేసింది. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో రోగుల అత్యవసర రవాణా, సమన్వయ సేవలను మెరుగుపరిచేందుకు ఎవర్గ్రీన్ హెల్త్‌కేర్‌తో వ్యూహాత్మక భాగస్వామాన్ని కుదుర్చుకున్నది.
ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో ఎయిర్ అంబులెన్స్ సర్వీసులు మరింత బలోపేతం కావడంతోపాటు ప్రమాదాలు, గుండెపోటు, తీవ్రమైన గాయా లు, అవయవాల వైఫల్యం వంటి అత్యవసర పరిస్థితుల్లో రోగిని తరలించడానికి వీలు పడనున్నదని మెడికవర్ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.