1.59 లక్షలకు పుత్తడి
గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.850 అధికమై రూ.1.59 లక్షలకు చేరుకున్నది. మరోవైపు, కిలో వెండి రూ.2.64 లక్షల వద్ద స్థిరంగా ఉన్నది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 : గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.850 అధికమై రూ.1.59 లక్షలకు చేరుకున్నది. మరోవైపు, కిలో వెండి రూ.2.64 లక్షల వద్ద స్థిరంగా ఉన్నది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన పుత్తడి వైపు మళ్లించడంతో వీటి ధరలు పుంజుకున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
వీటికి తోడు రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం తో అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు కూడా ధరలు పెరగడానికి పరోక్షంగా కారణమయ్యాయన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 30.83 డాలర్లు అందుకొని 5,027. 13 డాలర్లకు చేరుకోగా, వెండి 2.55 శాతం అధికమై 80.5 డాలర్ల వద్దకు చేరుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

