హైదరాబాద్, ఫిబ్రవరి 20 : దేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ కాంట్రాక్ట్ రీసర్చ్-డెవలప్మెంట్ సంస్థ సాయి లైఫ్ సైన్సెస్ భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 700కి పైగా టెక్నికల్, మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోబోతున్నట్టు కంపెనీ సీఈవో, ఎండీ కృష్ణ కనుమూరి తెలిపారు. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, అధిక నాణ్యత కలిగిన ఔషధాలకు డిమాండ్ ఉండటంతో వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఈ నియామకాలు చేపట్టినట్టు చెప్పారు.