నర్సాపూర్: బంగారం నగల దుకాణాల యజమానులు జాగ్రత్త వహించాలని నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి సూచించారు. గురువారం నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో జ్యువెలరీ దుకాణ యజమానులతో సీఐ జాన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారం దుకాణాలలో ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి జ్యువలరీ దుకాణాలలో సీసీ కెమెరాలు, అలర్ట్ అలారం సిస్టంను, సెక్యూరిటీ గార్డ్ ను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పరిచయం లేని, తెలియని వ్యక్తులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లింగం, జువెలరీ దుకాణ యజమానులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.