హనుమకొండ చౌరస్తా, జులై 23: ఒకప్పుడు మద్రాస్ క్రికెట్ అసోసియేషన్‌గా ఉన్న తమిళనాడు ప్రాంతాన్ని తమిళనాడు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మార్చుకున్న విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరును తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌గా మార్చాలని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి ఉదయభానురావు కోరారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి క్రికెట్ స్టేడియం, క్రీడాపాఠశాలకు కృషి చేసిన సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించి వినతిపత్రాన్ని అందజేశారు.
తన చిన్నతనంలో క్రికెట్ ఆడుతూ తోటి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ తనకు క్రికెట్ మీద ఉన్న అభిమానంతో జిల్లాలోని ఇతర శాసనసభ్యులు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, యశస్వినిరెడ్డితో కలిసి రాష్ర్ట ముఖ్యమంత్రిని కలిసి జిల్లాలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం క్రీడాపాఠశాల కోసం ఒప్పించిన సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ క్రికెట్ క్రీడాకారులు మట్టెడ కుమారస్వామి, దండ్రె రమేష్(చిన్న), బండారి ప్రభాకర్ ఉన్నారు.